పురాతన పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం అఫిడవిట్

బుధవారం, 29 జులై 2020 (11:31 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతమనమైనదని, దాన్ని కూల్చివేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 
 
ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది.
 
'ఈ భవనం నిర్మాణం 1921 సంవత్సరంలో ప్రారంభమై... 1937లో ముగిసింది. ఇప్పటికి దాదాపు వందేళ్లు గడిచాయి. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి. కాబట్టి.. ప్రస్తుత అవసరాలకు, సాంకేతికతకు ఈ భవనం సరిపోదు' అని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు