ఢిల్లీ స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయండి: కేంద్రం

గురువారం, 29 డిశెంబరు 2016 (09:15 IST)
స్కూల్ బస్సుల్లో పిల్లలకు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు అసభ్య చిత్రాలను చూపుతున్నారని సుప్రీం కోర్టు మహిళా లాయర్ల సంఘం కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఇది పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. దీన్ని నివారించేలా చూడాలని కోరింది.

ఢిల్లీ వంటి నగరాల్లో స్కూలు బస్సుల్లో సిబ్బంది తమ సెల్ ఫోన్లలో విద్యార్థులకు అశ్లీల చిత్రాలను, కంటెంటును చూపుతున్న వైనంపై సుప్రీంకోర్టు మహిళా లాయర్లు ఆందోళన వ్యక్తం చేసింది. 
 
దీంతో స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ పాఠశాలల ప్రాంగణాల్లో ఇలా జామర్లు ఏర్పాటు చేయలేమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల కంప్యూటర్లకు ఇది అడ్డు పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి