పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

డీవీ

శుక్రవారం, 21 జూన్ 2024 (19:39 IST)
Padmavyuham lo Chakradhari
నటీనటులు: ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: జీ. అమర్, సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య, ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్, నిర్మాత:  కే.ఓ.రామరాజు, దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు
 
పద్మహ్యూహంలో చక్రధారి అనే పేరు వినగానే భారతంలో ఓ కథ గుర్తుకు వస్తుంది. అలాంటి అంశమే ఇందులో వుంటుందని రిలీజ్ కు ముందు అనిపిస్తుంది. దానికి తగినట్లు సాంగ్స్,  ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
 ఓ గ్రామానికి చెందిన చక్రీ (ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌) సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. స్నేహితులతో సరదాగా గడుపుతాడు. ఓ రోజు అదే ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. సత్యకు జాబ్ రావడంలో చక్రీ సాయపడతాడు. ఒకే ఊరు కావడంతో స్నేహం ప్రేమగా మారుతుంది. సాఫీగా జరుగుతున్న ప్రేమకు షడెన్ అడ్డంకి వస్తుంది. 
 
 సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. తనకు చెప్పకుండా వెళ్ళిందే అనే ఆశ్చర్యపడి తన  ఉద్యోగానికి లీవ్ పెట్టి చక్రీ విలేజ్‌కి వెళుతాడు. ఊరిలో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) సాయంతో సత్యను కలువాలనుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ దశలో సత్యను పెళ్లి చేసుకోవాలంటే సత్య నాన్న కొన్ని రూల్స్ పెడతాడు? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా. 
 
సమీక్ష:
 భారతంలో పద్మవ్యూహంలో చిక్కుకొని ఎలా బటయకు వచ్చాడనేది అర్జునుడే తెలుసు. ఇందులో హీరోకే తెలుసు. అలా లింక్ చేసి తీసిన సినిమా ఇది. సిటీ, విలేజ్ మధ్య కథ. మధ్యలో స్నేహితులు వారి క్యారెక్టర్లు బాగా ఎంటర్ చేయిస్తాయి. సహజంగా విలేజ్ లో వుండే పాత్రలను బాగా డీల్ చేశాడు దర్శకుడు. ప్రేమ అనే అంశాన్ని మొదటి భాగంలో చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ, ఆ తర్వాత దూరం కావడం అనేవి గత సినిమాలో వున్నా ఇందులో కాస్త భిన్నంగా వుంది.
 
మరోవైపు ఎంటర్ టైన్ మెంట్ కుబాగా చూపించాడు.  ఇక హీరో హీరోయిన్లు దొరికిపోయిన తరువాత సత్య వాళ్ల నాన్న తన అల్లుడికి ఉండవలిన క్వాలిటీస్ చెప్పడంతో సినిమాలో  కొత్త కోణం మొదలు అవుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు బాగున్నాయి. హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ సైతం బాగుంది.  ప్రేమతోపాటు వచ్చే పాటలు, సన్నివేశపరంగా వచ్చే వినోదం కూడా కథానుగుణంగా వుంది. 
 
అయితే ఇందులో కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయింది. ఏది ఏమైనా హీరోగా ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ కొత్తవాడైనా  మెప్పిస్తాడు. లవ్ సీన్లలో చాలా బాగా నటించాడు.   సాంగ్స్, యాక్షన్ సన్నివేశాలు  కష్టం కనిపించింది.  హీరోయిన్ శశికా టిక్కూ కళ్లతో, హావభావాలు చూపించింది.  అషురెడ్డి తను గ్లామర్ క్యారెక్టర్ కాకుండా సెటిల్డ్ క్యారెక్టర్ చేసింది. ఒక పిల్లాడి తల్లిలా నటించింది.  ప్రత్యేకంగా మధునందన్ నటన బాగుంది. రెండు వెరియేషన్స్ ఉన్న పాత్ర చేశాడు. ఇక కోటి పాత్రలో భూపాల్ రాజ్ జీవించాడు. మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
 
సాంకేతికంగా రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ లో నెేటివిటీకి తగ్గట్టుగా వున్నాయి. . సినిమాటోగ్రఫీ ఓకే. నేపథ్య సంగీతం బాగుంది.  నిర్మాణ విలువలు ఉన్నంతలో చాలా బాగున్నాయి. విలేజ్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్నిచోట్ల కథనం సాగదీతగా వున్నా మొత్తంగా యూత్ మెచ్చే చిత్రమిది
 రేటింగ్: 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు