ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిజానికి ఈ నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ నిషేధం ఐదేళ్ళ పాటు కొనసాగుతుందని అందులో పేర్కొంది. కాగా, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎల్టీటీఈపై కేంద్రం తొలిసారి నిషేధం విధించిన విషయం తెల్సిందే.