కరోనా వ్యాక్సిన్ ధర రూ.250: నిర్ధారించిన కేంద్రం

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:28 IST)
కరోనా వ్యాక్సిన్‌ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. కరోనా వ్యాక్సిన్‌ ధరను రూ. 250గా నిర్ధారించింది కేంద్రం. దీంతో ఇక ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ రూ. 250కే లభించనుంది. మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. 
 
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ రేట్‌ను ఫైనల్‌ చేసింది. మార్చి 1 నుంచి ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉచితంగానే కోవిడ్‌ టీకాలు వేయనుండగా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం కోవిడ్‌ టీకాకు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ ధర రూ. 150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ. 100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది.
 
రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికీ కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు