చంద్రుని దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకు గాను పంపబడిన చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్ చంద్రునికి పై భాగంలో దిగింది. కానీ చంద్రునికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే సిగ్నల్ అందలేదు. రెండు నెలల క్రితం చంద్రుడిపైకి ఇస్రో పంపిన ఈ చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం విఫలమవడంతో.. మళ్లీ చంద్రుడిపైకి మరో మిషన్ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది.
సోమనాథ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఇస్రో ఎదురుచూస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కమిటీకి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పిన అధికారి ఆ సూచనలకు అనుగుణంగా నివేదిక తయారు చేస్తుందని అధికారి తెలిపారు. వచ్చే ఏడాది నవంబర్లో చంద్రయాన్ -3ని ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ సారి అంటే చంద్రయాన్-3లో రోవర్, ల్యాండర్పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామని అధికారి వెల్లడించారు.