ఏటీఎం మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నడుం బిగించింది. ఏటీఎంలో జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు వీలవుతుంది.