ప్రేమకు వయసుతో పనిలేదు. రెండు మనసులు కలిస్తే చాలని ఓ మైనర్ నిరూపించాడు. తాను చదువుకునే టీచర్‌పై మనసు పారేసుకున్నాడు. అతని ప్రేమకు ఆ టీచరమ్మ కూడా సమ్మతించింది. దీంతో కొంతకాలం పాటు వారిద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తాను తప్పు చేస్తున్నానని గ్రహించిన టీచర్... ఆ యువకుడుని దూరంగా పెట్టింది. దీంతో టీచర్‌పై కక్ష పెంచుకున్న మైనర్ వినూత్నపద్దతిలో వేధింపులకు పాలపడ్డాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, 17 యేళ్ళ మైనర్ బాలుడు... 22 యేళ్ల మహిళా టీచర్ వద్దకు ప్రతి రోజూ టూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ టీచర్‌ను మైనర్ బాలుడు ప్రేమించసాగాడు. అతని ప్రేమను గ్రహించిన ఆ టీచర్ కూడా సమ్మతం తెలిపింది. ఇద్దరూ కలిసి ఏకాంతంగా కలుసుకుంటూ వచ్చారు. అయితే, తాను తప్పు చేస్తున్నానని తెలుసుకున్న టీచర్.. ఆ బాలుడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి వినూత్న పద్ధతిలో వేధింపులకు పాల్పడసాగాడు.
ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ బుక్ చేసి వేధించాడు. ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు ఎవరో గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్ చేశారు. ఆ మైనరా బాలుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా... మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.