భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ 23 పేజీల నివేదిక తయారుచేసింది. ఈ నివేదిక వివరాలు ఇటీవలే బయటపడ్డాయి. ఆయనపై దాడి జరిగే సూచనలున్నాయని సంస్థ అంచనా వేసింది.
కాగా.. రాజీవ్ గాంధీ హత్యకు గురైతే ఖచ్చితంగా భారత్ అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోందని కూడా సీఐఏ ఆనాడే అంచనా వేసింది. పలువురు గ్రూపులు రాజీవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సిఐఏ రిపోర్టు తెలిపింది. రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పివి నరసింహరావు లేదా విపి సింగ్ లాంటి వారు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని సిఐఏ తెలిపింది.