ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీకి సంబంధించిన 10, 12వ తరగతుల రికార్డుల తనిఖీకి అనుమతించాలని సీబీఎస్‌ఈని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఆ రికార్డులు వ్యక్తిగత సమాచారం కిందికి వస్తాయన్న సీబీఎస్‌ఈ వాదనను తోసిపుచ్చింది.
స్మృతి రికార్డుల తనిఖీ కోసం ఆర్టీఐ దరఖాస్తుదారుడికి 60 రోజుల్లోపు అనుమతించాలని, అడ్మిట్‌కార్డు, మార్కుల లిస్టుల్లోని ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారం మినహా ఇతర సమాచారాన్ని అందివ్వాలని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు.
తనిఖీకి వీలుగా స్మృతి ఇరానీ రోల్ నంబర్, లేదా రిఫరెన్స్ నంబర్‌ను 1991-93నాటి రికార్డులున్న సీబీఎస్‌ఈ (అజ్మీర్)కు ఇవ్వాలని జౌళి శాఖను, ఇరానీ ఉత్తీర్ణులైనట్లు చెబుతున్న ఢిల్లీలోని హోలీచైల్డ్ స్కూల్‌ను సీఐసీ ఆదేశించారు.