అమర్‌నాథ్ గుహపై మేఘాలు పేలాయి.. నిజమా..? (video)

బుధవారం, 28 జులై 2021 (19:35 IST)
cloud burst
అవును మీరు వింటున్నది నిజమే. జమ్మూ-కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహపై మేఘం పేలింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ క్లౌడ్ బర్స్ట్‌తో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ పోలీసుల శిబిరాలకు భారీ నష్టం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రకృతి ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కరోనా కారణంగా ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర వాయిదా వేయడం అదృష్టం. ఎందుకంటే.. అక్కడ భక్తులు లేరు. 
 
కాగా.. హిమాలయాల ఎగువన సుమారు 3,880 అడుగుల ఎత్తులో ఉన్న శివుడి ఆలయాన్ని దర్శించుకొనేందుకు ప్రతి ఏటా జూన్ మాసంలో అమర్ నాథ్ యాత్రికులకు ప్రభుత్వం అనుమతిని ఇస్తోంది. 
 
జూన్ 28 న వహల్గామ్ , బాల్తాల్ జంట మార్గాల నుండి ఈ యాత్ర ప్రారంభిస్తారు. ఆగష్టు 22న యాత్ర ముగిస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఈ యాత్ర రద్దు అయ్యింది. కరోనాను పురస్కరించుకొని గత ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Reports of cloudburst near Amarnath Shrine cave. #Kashmir pic.twitter.com/Eq24w3eMdF

— Ieshan Wani (@Ieshan_W) July 28, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు