విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం ప్రమాదకరం.. నిఘా సంస్థలు

సోమవారం, 5 జులై 2021 (16:03 IST)
దేశ భ‌ద్ర‌త దృష్ట్యా విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం అత్యంత ప్రమాద‌క‌రం అని నిఘా సంస్థ‌లు గుర్తించాయి. అందుకే చాలా చోట్ల డ్రోన్ల వినియోగాన్ని క‌ట్ట‌డి చేస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటిని నిషేధిస్తూ, ప‌లు రాష్ట్రాల్లో ఆంక్షు జారీ అయ్యాయి. 
 
కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. 
 
గ‌త మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో శ్రీశైలం దేవ‌స్థానం అప్రమత్తం అయింది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట నిఘా తీవ్ర‌త‌రం చేశారు. 
 
అస‌లు రాత్రి పూట గ‌గ‌న త‌లంలో సంచ‌రిస్తున్న అవి డ్రోన్ల లా లేక మ‌రేవైనానా అని  గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డ్రోన్ల విన‌యోగంపై నిఘా పెట్టామ‌ని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు