బెంగుళూరు సిటీ బస్సులో మంటలు - అగ్నికి ఆహుతైన కండక్టర్

శుక్రవారం, 10 మార్చి 2023 (14:13 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బెంగుళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు‌కు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి అగ్నికి దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ కూడా సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతిడిని ముత్తయ్యగా పోలీసులు గుర్తించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్టాండులోని డి గ్రూపు స్టాపులో పార్క్ చేశాడు. బస్ స్టేషన్‌లో విశ్రాంతి మందిరంలో ప్రకాష్ నిద్రపోగా, కండక్టర్ ముత్యయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయాడు. ఈ క్రమంలో రాత్రివేళ బస్సు నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గాఢ నిద్రలో ఉన్న ముత్తయ్య కాలిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు