నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఈ పరిశోధనా కేంద్రంలో ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ వచ్చింది. గత నెల 27వ తేది నుంచే వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమైక్రాన్ అయి ఉండొచ్చనే అనుమానంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
షార్‌లో కరోనా మూడవ వేవ్ ప్రారంభమైందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం 12 మందికి పాజిటివ్‌గా తేలడంతో షార్ యాజమాన్యం ఉలికిపడింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం విశేషం. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ డీఆర్‌డీఎల్‌లలో ఒక్కొక్కరు సూళ్లూరుపేట శివార్లలో మరో షార్ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకడంతో సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఏర్పడుతోంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి నుంచి కరోనా నిబంధనలను కఠినా ఇక్కడ పాటిస్తూనే ఉన్నారు. కానీ, కొత్తగా వచ్చే వారి నుంచి కరోనా వ్యాప్తి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.