కరోనా వైరస్.. పెరిగిపోతున్న వాట్సాప్ వాడకం..

శుక్రవారం, 27 మార్చి 2020 (13:09 IST)
కరోనా వైరస్ కారణంగా గడప దాటి బయటికి రాలేని పరిస్థితి. దీంతో ప్రజలంతా డేటాను తెగ వాడేస్తున్నారు. దీంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌లో నెటిజన్లు గడిపే కాలం అమాంతం పెరిగిపోయింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో 27 శాతం పెరిగిన యూజర్ల సంఖ్య.. కరోనా మొదట దశ ముగిసే సరికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. 
 
ఇక సెలబ్రెటీలు సైతం సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇంకా వారిని అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్నాయి.
 
దీంతో ఉద్యోగులంతా సమాచారం కోసం వాట్సప్‌ గ్రూపులు, వీడియోలు కాల్స్‌ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అలాగే సాధారణంగానే సోషల్‌మీడియా వాడటం పెరుగుతోంది. అంతేకాక సోషల్‌ మీడియాలో యువత ముచ్చట్లు, చాటిం‍గ్స్‌ కూడా ఎక్కువే చేస్తున్నాయని తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు