తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్వెల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి స్థానికంగా ఉండే కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని ఉంచుతున్నారు. ఇలాంటి వారిలో 40 ఏళ్ల మహిళ కూడా కరోనా పాజిటివ్‌తో అక్కడ చేరింది.
ఈ సందర్భంగా పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ, క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్‌తో అక్కడున్న మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని.. విషయం తెలిసిన వెంటనే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.