పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్ అతనికున్న ఆవుల ద్వారా పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. కానీ బుధవారం ఓ ముళ్ల పొదలో అతని ఆవు విగతజీవిగా కనిపించింది.