అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయ్: సీపీఐ

బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (18:53 IST)
అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని సీపీఐ ఆరోపించింది. అదానీతో పాటు అదానీ సోదరుడు వినోద్ అదానీ తమ తొలినాళ్ల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఉన్నారని, వారిపై గుజరాత్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని నారాయణ పేర్కొన్నారు. 
 
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని, డ్రగ్స్ వ్యాపారం చేసేందుకు దేశంలోని ఓడరేవులను కొనుగోలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. 
 
మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఐ సీనియర్ నేత అజీజ్ పాషాతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించిన నారాయణ... అదానీ, అతని సోదరుడు వినోద్ అదానీలు తమ తొలినాళ్ల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారని, వారిపై గుజరాత్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. 
 
2021లో అదానీ గ్రూప్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలోని ముంద్రా పోర్ట్‌లో 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం అతనికి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయనడానికి నిదర్శనమని నారాయణ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు