అత్యాచారానికి పాల్పడి పంచాయితీ పెద్దలు జరిమానా విధిస్తే కట్టేసే వాళ్లను చూశాం. అమ్మాయి జీవితం బలైపోయింది. మెడలో తాళి కట్టి బుద్ధిగా కాపురం చేసుకో అంటే ఒప్పేసుకునే వాళ్లను చూశాం. కానీ అత్యాచారం చేసి కూడా పెళ్లి చేసుకోవాలంటే అయిదు లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసి పెళ్ళిని ఆపేసిన ప్రబుద్ధుడు క్రిమినల్స్‌లో క్రిమినల్‌గా నిలబడ్డాడు.