బంగాళాఖాతంలో ఏర్పడివున్న దానా తుఫాను ఒడిశా రాష్ట్రంలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య అక్టోబరు 24 రాత్రి లేదా మరియు అక్టోబరు 25వ తేదీ తెల్లవారుజామున తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను తీరందాటే సమయంలో గాలుల వేగం గంటకు 100-110 కి.మీ, గంటకు 120 కి.మీ వరకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం తూర్పు - మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉండగా, ఈ నెల 22వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది మరియు అక్టోబరు 23వ తేదీ నాటికి తుఫాను తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది.
మరోవైపు, ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా, బుధవారం ఉదయానికి తుఫానుగా బలపడుతుందని పేర్కొంది. పిమ్మట వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది. అదే దిశలో కొనసాగి.. 24వ తేదీ అర్థరాత్రి లేదా 25వ తేదీ తెల్లవారుజామున పూరి, సాగర్ దీవులు (పశ్చిమ బెంగాల్) మధ్య పారాదీప్ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత బుధవారం రాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో విశాఖపట్నానికి సమాంతరంగా రానుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా 23వ తేదీ రాత్రి నుంచి విశాఖపట్నం జిల్లాలో వర్షాలు కురిసే అవకాం ఉందని తెలిపారు. తర్వాత తీవ్ర తుఫాన్ బలపడి ఒడిశా వైపు పయనిస్తుందన్నారు. ఈ నెల 24, 25వ తే దీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.