'శిక్ష పడుతుందనే భయం కూడాలేని లెక్కలేనితనం పెరిగిపోతోంది. లాభదాయక ప్రతిఫలాలను ఆశిస్తూ... సామాజిక భావజాలంపై పట్టుసాధిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న ఈ బహిరంగ అవినీతిని ప్రజా బాహుళ్యం నుంచి తరిమికొట్టేందుకు అన్ని దశల్లో వ్యక్తిగతంగా, సమిష్టిగా జోక్యం చేసుకోవటం అనివార్యం' అని జస్టిస్ రాయ్ వ్యాఖ్యానించారు.
'అక్రమ మార్గాల ద్వారా సంపద పోగేసుకోవాలనుకునే దురాశపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరుల్లో అపరాధ భావం కూడా కనిపించడంలేదని, శిక్ష పడుతుందనే భయం కానరావటం లేదని తెలిపారు. సమాజంలో ఇలాంటివారిదే పైచేయి అవుతుండటంతో నిజాయితీపరులు దిక్కుతోచని వారవుతున్నారని తెలిపారు.