వారు రోడ్డుపై గొడవకు దిగడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడిందన్నారు. పోలీసులు వచ్చినా గొడవ ఆపకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో లాఠీతో కొట్టినట్లు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మరోవైపు, నడి రోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీని ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు.