దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. అంతేకాకుండా, ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. పైపెచ్చు.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌కు స్వప్న సురేశ్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు.
ఇకపోతే, ఈ కేసును దర్యాప్తు చేసుతున్న ఎన్.ఐ.ఏ.... తాజాగా న్యాయస్థానానికి కీలక సమాచారంతో ఓ నివేదికను సమర్పించింది. ఈ బంగారం తరలింపులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని భావిస్తున్నట్టు ఎన్ఐఈ న్యాయస్థానానికి వెల్లడించింది.
బంగారం అక్రమరవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యక్రమాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడని నిఘా వర్గాలు సమాచారం అందించాయని ఎన్ఐఏ వివరించింది. నిందితుల్లో ఒకడైన రమీజ్‌ను విచారించడం ద్వారా ఎన్ఐఏ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.