మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు షాకిచ్చింది. అతడి ఆస్తులని సీజ్ చేసింది. యూఏఈ సీజ్ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్ ఇబ్రహీం అని తెలిసిందే.
ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు. అతడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్‌లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15,000కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన దౌత్య విజయమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు బీజేపీ అధికారిక ట్వీట్టర్ పేజీలో ఈ వ్యాఖ్య పెడుతూ దానికి గ్రాఫిక్ చేసిన దావూద్ గురించిన సమాచారాన్ని ఉంచింది.