తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్‌వర్ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి.
పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు భార్య పలుమార్లు ప్రయత్నించింది. కానీ, భర్త అంగీకరించలేదు. దీంతో ఆ ఇల్లాలు జీవితమంతా పిల్లలుకంటూనే వచ్చింది. చివరకు తన 16వ బిడ్డకు జన్మనిస్తు ప్రాణాలు వదిలింది.
దీనిపై మృతురాలి బిడ్డల్లో ఓ కుమార్తె స్పందిస్తూ, 'నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను.