తన భర్త ఆకస్మికంగా కొత్త పార్టీ పెడతానని చేసిన ప్రకటన పట్ల షాక్ ఇచ్చిన దీప జయకుమార్ తెలిపారు. అతని వెనుక శశికళ వర్గం ఉందని, అసత్య ప్రచారాలను వాళ్ళే చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాన్ని ఎంజీఆర్, అమ్మా దీపా పేరవై కార్యకర్తలు నమ్మరాదని దీప కోరారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు, మంచినీటి పథకాలు దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తున్నాయి. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయడానికి ముందుకొచ్చింది. తాజాగా ఈ జాబితాలో హర్యానా కూడా చేరుతోంది. హర్యానా మంత్రి నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో అధికారుల బృందం చెన్నైలోని ‘అమ్మ’ క్యాంటీన్లను పరిశీలించింది. తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. నగరంలోని మంచినీటి పథకాలను కూడా ఈ బృందం అధ్యయనం చేసింది.