వరుడు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు.. మెట్రో రైల్ సిబ్బంది సాయపడ్డారు (వీడియో)

శనివారం, 30 డిశెంబరు 2017 (18:03 IST)
మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ జంటకు పెళ్లి గిప్టుగా కోచ్ వన్ కార్డు కూడా ఇచ్చామని మెట్రోరైల్ సిబ్బంది తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌లోని పాలక్కాడ్‌కు చెందిన రంజిత్‌కుమార్‌తో అదే రాష్ట్రంలోని ఎర్నాకుళంలోని ధన్య అనే యువ‌తికి పెద్ద‌లు వివాహం ముహూర్తం కుదుర్చారు. 
 
పెళ్లి పందిరంతా బంధుమిత్రుల‌తో కోలాహలంగా ఉంది. వరుడి రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వరుడు కుటుంబం మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అయితే వరుడి కుటుంబీకులు కారు నుంచి దిగి మెట్రో రైలులో వెళ్లాలనుకున్నారు. 
 
కానీ అక్కడా రద్దీ చూసి షాకయ్యారు. ఆపై మెట్రో సిబ్బందికి పెళ్లి వుందంటూ త్వరగా వెళ్లాలని చెప్పడంతో.. వారు టికెట్లు ఇవ్వడంతో పెళ్లి కొడుకు కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మెల్రోరైల్లో ప్రయాణించి ఆ పెళ్లికొడుకు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

It's our pleasure to keep your wide smiles intact. Here's a story of how #KochiMetro saved Ranjith's and Dhanya's wedding day. We present to you Kochi1 cards, as a token of our love; Happy Married Life. #MyKochiMetro pic.twitter.com/5W8yLb42nB

— Kochi Metro Rail (@MetroRailKochi) December 28, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు