అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న సమంత... అక్కినేని వారసుడు చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజంగా చైను సమంత ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకుందో ఇపుడు తెలిసింది.
'మనం' చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం "హలో". అఖిల్, ప్రియదర్శిని ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌లతో పాటు నాగ చైతన్య, సమంతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
కాగా, ఈ కార్యక్రమానికి సమంత ఫుల్‌లెన్త్ లెహంగా ధరించి హాజరు కాగా, అక్కినేని వారి కొత్త కోడలిని చూసి అభిమానులు మురిసిపోయారు. సమంత ప్రస్తుతం 'మహానటి' చిత్రంతో పాటు "రంగస్థలం" చిత్రాలు చేస్తుంది. తమిళంలోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెల్సిందే.