పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదు : ఢిల్లీ కోర్టు

సోమవారం, 22 జనవరి 2018 (10:33 IST)
పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మహిళ శరీరం ఆమె సొంతం. దీనిపై ఆమెకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొంది. అందువల్ల మహిళ అనుమతి లేకుండా ఎవరైనా సరే ఆమె శరీరాన్ని తాకడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 
 
2014లో ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో 9 ఏండ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్ వాసి చావి రాం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి ఐదేండ్ల జైలుశిక్షను విధించింది. 
 
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీమ మైనీ స్పందిస్తూ మహిళకు వ్యక్తిగత గోప్యత హక్కు అనేది ఉంటుందని, ఈ హక్కును పలువురు పురుషులు కాలరాస్తున్నారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు