తాగుబోతు తండ్రి.. తాగొచ్చి.. వేధించాడు. ఇక చేసేది లేక కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తప్పతాగి ఇంటిక వచ్చి.. తల్లిని, చెల్లిని బూతులు తిడుతూ చావగొడుతున్నాడు.
ఈ కేసుపై కోర్టులో జరిగిన విచారణలో తాను తండ్రిపై కేసు పెట్టేందుకు గల కారణాలను అతడి కూతురు తెలిపింది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లిని, చెల్లిని తనను దుర్భషలాడుతూ శారీరకంగా హింసించేవాడని, లైంగిక ఫిర్యాదులు అంటే పోలీసులు తప్పకుండా స్పందిస్తారనే ఉద్దేశంతో తండ్రిపై కేసు నమోదు చేశానని చెప్పింది.
తండ్రి ఆగడాలతో ఇంట్లో తల్లి దుస్థితిని చూసి నిస్సహాయతకు గురైన బాలిక తన తండ్రికి బుద్ధిచెప్పాలనే ఉద్దేశంతో ధైర్యంగా ముందుకు వచ్చిన తీరును కోర్టు ప్రశంసించింది. అనంతరం బాలిక తండ్రిని రూ.25వేల పూచికత్తు మీద కోర్టు విడుదల చేస్తూ.. అతని ప్రవర్తన నడవడికపై ఏడాదిపాటు పరిశీలిస్తామని, ఒకవేళ మళ్లీ ప్రవర్తనలో తేడా వస్తే.. జైల్లో పెడతామని హెచ్చరించింది.