డాక్టర్ వద్ద రూ.70లక్షలు ఎలా? అదీ రూ.100 నోట్లే.. షాకైన పోలీసులు

గురువారం, 17 నవంబరు 2016 (15:00 IST)
దేశంలో నోట్ల రద్దు వ్యవహారం పెనుదుమారాన్నే రేపింది. 1000, 500 నోట్లు రద్దు కావడంతో చిల్లర దొరకక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. కార్డులు వినియోగించినా.. అవసరానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నోట్ల రద్దు ఉత్పన్నమైన సమస్యలు సర్దుకునేందుకు ఇంకా 45 రోజులు పట్టేలా ఉన్నాయి. ఇలా ప్రజలు చిల్లర కోసం ఇక్కట్లు పడుతుంటే.. ఓ పిల్లల వైద్యుడు రూ.70లక్షలతో పారిపోవాలనుకున్నాడు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలోని ఓ పిల్లల వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.70లక్షల రూపాయల మొత్తానికి వందనోట్లే ఉండటం చూసిన పోలీసులు షాకయ్యారు. నల్లాల్ అనే వైద్యుడు మొత్తం నగదును కట్టలు కట్టి కారులో పెడుతుండగా అటుగా వెళ్ళి వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న రూ69.86 లక్షల విలువైన వంద నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఐటీ శాఖాధికారులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి