వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జంటకు విడాకులు.. అంతా కరోనా పుణ్యమే..

బుధవారం, 17 జూన్ 2020 (14:53 IST)
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. దీంతో జనాలు బయట కనిపించకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా ఆన్‌లైన్ ద్వారానే అన్నీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి ద్వారా ఓ జంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చేయడం జరిగింది.

కరోనా మహమ్మారి విజృంభణతో ఢిల్లీలోని ఓ ఫ్యామిలీ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. 2017 మేలో వివాహమైన జంట విభేదాలు తలెత్తడంతో ఏడాదికి పైగా విడివిడిగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
ఏడాదికి పైగా వేర్వేరుగా ఉంటున్న జంటలు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా రోహిణీ కుటుంబ న్యాయస్ధానం ఈ తీర్పును వెలువరించింది. హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్‌ 13 బీ (2) కింద 2019లో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసిన ఈ జంటకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు