సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపేయాలంటూ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్‌కు లక్ష రూపాయాల జరిమానాను విధించింది.
కరోనా వైరస్ మహమ్మారి బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది.