ఢిల్లీ రోహిణి కోర్టులో కాల్పులు - గ్యాంగ్‌స్టర్ జితేందర్ జోగి మృతి

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:33 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ కోర్టులోని రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టార్ జితేందర్ గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. 
 
రెండు గ్యాంగ్‌ల మధ్య ఉన్న పాతకక్షలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కోర్టుకు వచ్చిన జితేందర్ టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. అడ్వాకేట్ యూనిఫారమ్స్‌లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. గోగిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం.
 
కాగా, 30 యేళ్ల జితేందర్ గోగి గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేందర్‌పై ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్తికి తరలించారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాల్పులు జరిపింది టిల్లూ తాజ్పూరియా గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 40 రౌండ్ల కాల్పులు జరిగాయి. రెండేళ్ల క్రితం ఓ ఘటనకు సంబంధించి జితేందర్‌తో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అయిన కుల్దీప్ ఫజ్జాను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కుల్దీప్ ఫజ్జా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా జితేందర్ గ్యాంగ్‌లో 50 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

 

35-40 rounds of firings in #Delhi’s Rohini Court:

Jailed Gangster Jitender Gogi Killed by Rival, 3 Others reportedly Dead. pic.twitter.com/TulVkgxEUA

— PIYU$H Kshatriya Speaks (@SpeaksKshatriya) September 24, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు