తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని 25 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసిన నిందితుడిని ఢిల్లీ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఈ దారుణ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురాలో చోటుచేసుకోగా, తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గత శుక్రవారం కూడా అదేవిధంగా తన ఇంటి ముందు తచ్చాడుతుండగా షానును ఇంట్లోకి పిలిచాడు. షాను మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న వినోద్.. ఒక్కసారిగా షాను మీద కత్తితో దాడికి దిగాడు. వినోద్ ఇంట్లో ఉన్న ఓ మైనర్ బాలుడు షానును వెనుకనుంచి గట్టిగా పట్టుకోగా.. నా భార్యను ప్రేమిస్తూ, ఆమెతో సంబంధం పెట్టుకుంటావా? బిగ్గరగా అరుస్తూ షానును కత్తితో 25 సార్లు పొడిచాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.