ఢిల్లీ కాలుష్యంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఒక కొత్త విషయాన్ని తెలిపింది. పాకిస్థాన్ నుంచి కాలుష్యం వస్తుందని చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు కలుగజేసుకుని పాకిస్థాన్ దేశంలోని పరిశ్రమలను మూయించివేద్దామా? అంటూ ప్రశ్నించింది. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు తమ రాష్ట్రంలోని పరిశ్రమలను మూసి వేయించేందుకు ఉత్తరప్రదేశ్ ససేమిరా అంటోంది. పైగా, ఈ కాలుష్యం అంతా పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి వస్తుందంటూ సుప్రీంకోర్టుకు చెప్పడం వింతగా వుంది.
అంతేకాకుండా తమ రాష్ట్రంలోని పరిశ్రమలను మూసి వేయడానికి అభ్యంతరం తేలిపింది., పైగా, రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలు 8 గంటలే పనిచేయాలన్న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నిర్ణయం పట్ల చెరకు, పాల ఉత్తత్తుల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొంది.