రైతులను ఉద్దేసించి పలువురు రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా అంటూ మండిపడింది. పైగా, ఢిల్లీ కాలుష్యానికి రైతులను బాధ్యులను చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి రైతులు ఎలా కారణమో చెప్పాలంటూ మండిపడింది.
'కొందరు ఢిల్లీలోని ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చొని కాలుష్యానికి కారణం రైతులేనంటూ అభాండాలు వేస్తున్నారు. అసలు వారికున్న భూమితో రైతులకొచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా?' అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.