ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఘనుడు నమ్మించాడు. ఆతని మాయ మాటలు నమ్మి ఆ మహిళ వెంట వెళ్లింది. అయితే, కేటుగాడు మాత్రం ఆ మహిళ ఓ బిజినెస్‌మేన్‌కు విక్రయించాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్వాడ్ తాలూకాలోని ఉప్పిన్ బెటాగేరిలో నివసిస్తున్న ఒక మహిళ పేదరికంతో బాధపడుతూ వచ్చింది. ఇదే ప్రాంతంలోని అమీనాభవికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి ధార్వాడ్ తాలూకాలోని కేసీ పార్క్ సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్నప్పుడు మహిళతో పరిచయం ఏర్పడింది.
దిలీప్ ఆ మహిళను అహ్మదాబాద్‌కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్త ఇంట్లో సహాయకురాలి పనికి కుదిర్చాడు. నెల రోజుల తర్వాత వ్యాపారవేత్త ఇంటికి వచ్చిన దిలీప్.. ఆ మహిళకు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఉందని అక్కడ ఉద్యోగం మాన్పించి తనతో తీసుకెళ్లాడు. ఆ మహిళను గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులోని పదన్‌పూర్‌కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్తకు రూ.2 లక్షలకు విక్రయించాడు.