సినీ పరిశ్రమలోనే కాదు మహిళలను వేధించిన వారిలో క్రికెటర్లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. పలువురు పారిశ్రామిక వేత్తలు అంటూ ఆ రంగాన్ని కూడా వేలెత్తి చూపించడం సంచలనంగా మారింది. సినిమా నిర్మాతలు.. దర్శకులు అంతా వేధించిన వారైతే.. క్రికెటర్లు ఏమైనా మహత్ములా అంటూ దీపిక కాస్తంత ఘాటుగానే ప్రశ్నించింది.
కానీ వారిపై వచ్చిన ఆరోపణలు మాత్రం హైలైట్ కాలేదు. మీడియా దాన్ని ఫోకస్ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకన్ క్రికెటర్లు అర్జున రణతుంగ- లసిత్ మలింగ పేర్లతో పాటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ పేరు మీటూ ఉద్యమంలో భాగంగా వినిపించించాయి.