యువకుడి పొట్టలో కుట్టు సూదులు, గోర్లు, స్క్రూ డ్రైవర్లు

బుధవారం, 7 అక్టోబరు 2020 (11:20 IST)
Needle
యూపీలో వింత చోటుచేసుకుంది. ఓ యువకుడి పొట్టలో కుట్టు సూదులు, గోర్లు, స్క్రూ డ్రైవర్లు కనుగొన్నారు వైద్యులు. ఆపై శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వివరాల్లోకి వెళితే.. రోగి తండ్రి కమలేష్, పేషెంట్ కరణ్ పొట్ట నొప్పితో బాధపడ్డానని.. అయితే ఉపకరణాలను మింగివేశాడో తెలియదని వైద్యులకు తెలిపాడు.

18 ఏళ్ల యువకుడి పొట్టలో మూడు అంగుళాల పొడవైన ఇనుప గోర్లు, కుట్టు యంత్ర సూదులు, కడుపులో ఒక స్క్రూడ్రైవర్‌ వున్నట్లు స్కాన్ ద్వారా గుర్తించారు.  
 
వివరాల్లోకి వెళితే.. ఉన్నావోలోని భట్వా గ్రామంలో నివసిస్తున్న కరణ్ (18) కడుపునొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్ విజయవంతమైందని ఉన్నవోలోని శుక్లాగంజ్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ రాధా రామన్ తెలిపారు. 
 
సోమవారం మూడు గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స జరిగిందని రాధా రామన్ చెప్పారు. ఈ సమయంలో వైద్యులు పదునైన అంచుగల ఇనుప ఉపకరణాలు, 30 మూడు అంగుళాల ఇనుప గోర్లు, కఠినమైన అంచుగల సాధనం, నాలుగు అంగుళాల పొడవైన ఇనుప రాడ్, నాలుగు కుట్టు యంత్ర సూది థ్రెడర్లు స్క్రూడ్రైవర్లు కడుపులో వెలికి తీశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు