గుచ్చుకున్న వాటితో సెప్టిక్ అవుతుందేం?

శనివారం, 7 ఆగస్టు 2021 (10:36 IST)
పాత ఇనుప వస్తువులే కాదు, చాలా కాలం నేలమీద, మురికి ప్రదేశాల్లో ఉన్న ముళ్లు గుచ్చుకున్నా, పాత కర్రముక్కలు గుచ్చుకున్నా కూడా సెప్టిక్‌ అవుతుంది. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, చెక్క ముక్క సందుల్లో, ముళ్ల పొదల మూలల్లో నీటి ఆవిరి, దుమ్ము పేరుకుంటాయి.

వీటి మీద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరుచుకుని వేలాదిగా పెరిగిపోయి ఉంటాయి. ఆయా వస్తువులు మన శరీరానికి గుచ్చుకున్నప్పుడు ఆ గాయం ద్వారా సూక్ష్మజీవులు మన రక్తంలో కలుస్తాయి. రక్తంలో పోషక విలువలు కలిగిన జీవకణాలు ఆహారంగా లభించడంతో సూక్ష్మజీవుల వృద్ధి మరింతగా పెరుగుతుంది.

అందువల్ల పుండు (septic) అవుతుంది. నిజానికి చెత్త కుండీల్లో ఉన్న కాగితాలు, మురికి రోడ్డు మీది మట్టికణాలు రక్తాన్ని చేరుకున్నా ఇలాగే సెప్టిక్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే అవి గుచ్చుకోవు కాబట్టి ప్రమాదం ఉండదు.

పాత పడిన మురికి పరికరాలు ఏవి గుచ్చుకున్నా వైద్యుని సంప్రదించి టెట్నస్‌ టీకా తీసుకోవడం మంచిది.టెటనస్ క్రిములవలన ధనుర్వాతము అనే జబ్బు వచ్చే ప్రమాదము ఉంటుంది .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు