ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్‌డౌన్‌ పొడిగింపు.. తమిళనాడు ప్రకటన

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (20:14 IST)
ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. లాక్‌డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి 50 శాతం హాజరుతో తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్ధులకు పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసేందుకు తమిళనాడు కసరత్తు సాగిస్తోంది. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 1997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే  కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలవుతుందని,నైట్ కర్ఫ్యూని స్ట్రిక్ట్ గా అమలుచేయాలని పోలీసులని ఆదేశించినట్లు తెలిపారు.
 
ఇక, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ విధిస్తామని చెప్పారు. 8 కర్ణాటక సరిహద్దు జిల్లాలు- మైసూర్, చారమాజ్ నగర్, మంగళూరు, కొడగు, బెళగావి, బీదర్, కలబుర్గి, విజయాపుర జిల్లాలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు