కట్నం వల్ల లాభాలెన్నో.. బోధిస్తున్న బెంగళూరు కళాశాల.. అందవిహీనంగా ఉన్న అమ్మాయిలకు?

శనివారం, 21 అక్టోబరు 2017 (13:37 IST)
1961 నుంచి వరకట్నం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం చట్టవిరుద్ధం చేసింది. అయినా వరకట్నం తీసుకుంటూనే వున్నారు. అయితే బెంగ‌ళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ మాత్రం వ‌ర‌క‌ట్నం తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను, లాభాల‌ను బోధిస్తోంది. 
 
వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలను పాఠ్యాంశంలో పేర్కొంది. ఎక్కువ క‌ట్నం ఇవ్వ‌డం వ‌ల్ల అంద‌విహీనంగా ఉన్న అమ్మాయిలకు పెళ్లి చేయ‌వ‌చ్చ‌ని, అంద‌మైన అబ్బాయిల‌ను ఎక్కువ క‌ట్నం ఆశ‌చూపి పెళ్లికి ఒప్పించ‌వ‌చ్చ‌ని కాలేజీ పాఠ్యాంశంలో పేర్కొనడం జరిగింది. 
 
కట్నం తీసుకోవడం వల్ల పెళ్లైన తర్వాత దంపతులు కలిసి జీవించేందుకు కొంత ఆర్థిక సాయంగా వుంటుంది. మెరిట్ విద్యార్థులు ఉన్న‌త చ‌దువుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఎక్కువ క‌ట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమ‌గా చూస్తార‌ని, ఎక్కువ క‌ట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని స‌మాజం గుర్తిస్తుంద‌ని ఆ పాఠ్యాంశంలో వుంది.
 
దీనిపై విమర్శలు తలెత్తడంతో సదరు కళాశాల స్పందించింది. ఈ పాఠ్యాంశం సంగ‌తి తాము గ‌మ‌నించ‌లేద‌ని, దీనికి మూల కార‌ణం ఏంట‌నే విషయం తెలుసుకోవ‌డానికి విచార‌ణ చేప‌ట్టామ‌ని కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు