అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఆ సమస్యకు పరిస్కారం దొరకనుంది. దేశ సరిహద్దుల్లో ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో ఓ పరికరం తయారు చేసింది. కాగా ఈ పరికరాన్ని బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన 'ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ' తయారుచేసింది. దీనికి 'ఎస్‌పీవో-2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం' పేరుపెట్టారు.
ఈ పరికరానికి ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్‌డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కరోనా బాధితులకు వరంలా మారనుంది. ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ లెవల్స్‌ను గుర్తించి తక్కువ ఉంటే తగిన మోతాదులో అందిస్తుంది.