అయితే కుమారుడు ఏం చేయకుండా మద్యం, గంజాయి వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిందితుడు తన తల్లిని రూ. 20 అడిగాడు. తన దగ్గర చిల్లర లేదని, రూ. 500 నోటు మాత్రమే ఉందని తల్లి రజియా వివరించింది.
ఇంకా మరుసటి రోజు ఉదయం డబ్బు ఇస్తానని చెప్పింది. అడిగిన వెంటనే 20 రూపాయలు ఇవ్వలేదనే కోపంతో, అతను మొదట ఆమెపై ఇటుకతో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత గొడ్డలితో ఆమె గొంతు కోసి, అక్కడికక్కడే చంపాడు. దాడి తర్వాత, జంషెడ్ అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు.