అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను అడ్డుకున్న పోలీసుకు ముద్దులు పెట్టేసింది. ఈ ఘటన కోల్‌కతాలోని ఈస్ట్రన్ మెట్రోపాలిటిన్‌లోని సాల్ట్‌లేక్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి మందు కొట్టి కారు నడుపుతూ వచ్చింది. సాల్ట్ లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై నియంత్రణ కోల్పోయింది.
తాగిన మైకంలో వున్న మహిళపై కేసు రాసుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతుండగా, సదరు మహిళ కానిస్టేబుల్‌ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. అంతే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముద్దుల ద్వారా లంచం ఇవ్వజూపిందని కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.