అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు

సోమవారం, 6 మార్చి 2023 (13:20 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 5.07 గంటల సమయంలో ఈ రీజియన్‌లో భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం ఇండోనేషియాలో కూడా కనిపించాయని వెల్లడించింది.
 
మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటల సమయంలో ఉత్తర కాశీలో వరుసగా మూడుసార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. రెండుసార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అడవిలో తొలుత 12.40 గంటలకు భూమి కంపించిందని ఆ తర్వాత రెండోసారి 12.45 గంటలకు, మూడోసారి 1.05 గంటలకు భూకంపం వచ్చినట్టు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు