20 సీట్లలో 8 సీట్లు గెలిస్తేనే ప్రభుత్వం ఉంటుంది.. నేతలకు సీఎం ఎడప్పాడి

ఆదివారం, 4 నవంబరు 2018 (16:33 IST)
త్వరలో జరిగే 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కనీసం 8 సీట్లలో గెలిస్తేనే తన సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు ఉంటుందని లేనిపక్షంలో కుప్పకూలిపోతుందని పార్టీ నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టం చేశారు. 
 
పార్టీ రెబెల్ నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకర్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. అలాగే, డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే  హఠాన్మరణం కారణంగా ఏర్పడిన రెండు 
 
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికారపార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 20 నియోజకవర్గాలకు పర్యవేక్షక కమిటీలను కూడా నియమించింది. పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి, ఒ.పన్నీర్‌సెల్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఈ కమిటీల్లో ఉన్నారు.
 
ఈ నియోజకవర్గాలను కైవసం చేసుకొనేలా ఆ కమిటీలు బూత్‌కమిటీల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శనివారం ఉప ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గాలకు నియమించిన కమిటీల్లోని 120 మంది సభ్యులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం ఎడప్పాడి మాట్లాడుతూ, ఉప ఎన్నికలు జరుగనున్న 20 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రకటన ఏ క్షణంలోనైనా రావచ్చని, పర్యవేక్షణ కమిటీలు ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని ఉపదేశించారు. కనీసం 8 స్థానాల్లోనైనా గెలిస్తేనే తమ ప్రభుత్వం నిలుస్తుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని, అయితే బలనిరూపణకు 8 నియోజకవర్గాలు సరిపోతాయని భావించరాదని, 20 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు