సూరత్ మున్సిపాలిటీలో 27 స్థానాలు ఆమ్‌ఆద్మీ పార్టీవే..

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:40 IST)
గుజరాత్‌లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆయా కార్పొరేషన్లలో బీజేపీ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. అతి తక్కువ స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
 
ఇక, ఈ గుజరాత్ స్థానిక ఎన్నికల్లో అటు ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ సూరత్ మున్సిపాలిటీలో 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం గుజరాత్‌లో బోణీ కొట్టడం మరింత సంచలనంగా మారింది.
 
అలాగే గుజరాత్‌ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. గుజరాత్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో ఆరు మునిసిపల్‌ కార్పొరేషన్లను కూడా మళ్లీ కైవసం చేసుకోని సత్తా చాటింది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ కార్పొరేషన్లల్లో ఉన్న మొత్తం 576 సీట్లల్లో 483 స్థానాలను కైవసం చేసుకుంది. 
 
కాంగ్రెస్‌ 55 స్థానాల్లో, ఆప్‌ 27 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఈ నెల 21న.. అహ్మదాబాద్‌లో 192, రాజ్‌కోట్‌లో 72, జామ్‌నగర్‌లో 64, భావ్‌నగర్‌లో 52, వడోదరలో 76, సూరత్‌లో 120 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆరు కార్పోరేషన్లను బీజేపీ కైవసం చేసుకోని తన బలాన్ని నిరూపించుకుంది. అయితే.. సూరత్‌లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు