అంతే... పైనాపిల్ నోటి వద్దకు వెళ్లగానే టపాసులు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. దాంతో ఏనుగు తీవ్ర గాయాలపాలై అల్లాడిపోయింది. ఏనుగు నాలుక, నోరు, తొండం తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని నదిలోకి వెళ్లి గాయాలపై నీళ్లు చల్లుకుంటూ అలానే వుంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
కానీ ఆ ఏనుగు నది మధ్యలోనే ప్రాణాలు విడిచింది. చనిపోయిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా దాని కడుపులో నెల రోజుల గున్న ఏనుగు పిల్ల వున్నట్లు గుర్తించారు. పైనాపిల్ టపాసుల ధాటికి తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రెండూ చనిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌కు చెందిన అధికారి మోహన్ కృష్ణన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.